ఆదివారం ఎమ్మెల్యే బర్త్ డే
- టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరేష్ వెల్లడి
(మంచిర్యాల సిటీ, ఆంధ్రప్రభ) : ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తుముల నరేష్ తెలిపారు. నియోజకవర్గంలో దాతల నుండి 2000 యూనిట్ల బ్లడ్ సేకరణ చేస్తున్నామని, తలసేమియా బాధితులను ఆదుకుంటామని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంపును మండలాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

