తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు

తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025-2026 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో దాదాపు 48 రోజులు సెలవులు లభించనున్నాయి. 2026-2027 విద్యా సంవత్సరానికి జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగానే సెలవులు ప్రకటించినట్లు తెలిపింది.

Leave a Reply