సుమన్ కస్టడీ పిటిషన్‌పై ఉత్కంఠ..

మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కస్టడీ పిటిషన్ వాయిదా పడింది. మంచిర్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బాల్క సుమన్‌కు సంబంధించిన కస్టడీ పిటిషన్‌ను ఫిబ్రవరి 26కి వాయిదా వేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు, అలాగే సుమన్ తరఫు న్యాయవాదుల ప్రతివాదనలు వినిపించిన అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
తదుపరి విచారణ ఫిబ్రవరి 26న జరగనుంది.

Leave a Reply