Sujana Chowdhury| బాధితులకు అండగా ఉంటా..

Sujana Chowdhury| బాధితులకు అండగా ఉంటా..

అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తా..
పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు సుజనా చౌదరి

Sujana Chowdhury| ఆంధ్రప్రభ, భవానిపురం : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 42 ఫ్లాట్ల బాధితులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని శాసనసభ్యుడు యలమంచిలి సత్యనారాయణ(సుజనా) చౌదరి అభయమిచ్చారు. శనివారం భవానీపురం 42 ప్లాట్ల బాధితులు ఎమ్మెల్య‌ను కలిశారు. తాము నష్టపోయిన వైనాన్ని ఎమ్మెల్యేకు వివరించారు. న్యాయ నిపుణులతో బాధితులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా మాట్లాడించారు. భవిష్యత్ కార్యాచరణపై న్యాయవాదుల బృందంతో సుదీర్ఘంగా చర్చించారు. ప్లాట్ల వ్యవహారంపై కొందరు అధికారులతో కూడా ఎమ్మెల్యే మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకున్నారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బాధితులకు అవసరమైన అన్ని విధాలా సహాయ, సహకారాన్ని అందిస్తానన్నారు.

Leave a Reply