Suicide | వేధింపులు భరించలేక..

Suicide | వేధింపులు భరించలేక..
- సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్యాయత్నం..
- శ్రీశైలంలో ఘటన
- రెవెన్యూ సిబ్బంది వేధింపులే కారణం
- సెల్ఫీ వీడియోలో ఆరోపణ
Suicide | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న శివ అనే యువకుడు ఈ రోజు ఉదయం ఆత్మహత్యాయత్నం(suicide attempt) చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఒక సెల్ఫీ వీడియోను తీసుకొని.. సిబ్బంది ఇబ్బందుల వల్లే నేను ఫినాయిల్ తాగుతున్నానని వీడియోలు పేర్కొన్నాడు. దేవస్థాన రెవెన్యూ సిబ్బంది వేధింపులు భరించలేక సెక్యూరిటీ గార్డు శివ పినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశా రు.
తాను నివాసం ఉంటున్న ఇంటిలో మరమ్మతులు చేసుకుంటుంటే దానిని కూలగొట్టారని మనస్తాపం చెందిన శివ ఈ ఆత్మహత్యయత్నం చేయటం విశేషం. పినాయిల్ తాగిన శివను కుటుంబ సభ్యులు హుటాహుటిన దేవస్థానం హాస్పిటల్(hospital)కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు రిఫర్ చేశారు.
విషయం తెలుసుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కి ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలి అని కోరారు. బాధితుడు శివ ఆత్మహత్యాయత్నంకు గల కారణాలు ఏంటి అని విచారించి వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన శ్రీశైలం ఎమ్మెల్యే మమ్మీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
