హైదరాబాదులోని హబ్సిగూడ లో నలుగురు కుటుంబ సభ్యులు… ఆత్మహత్య చేసుకున్నారు.. మొదట ఇద్దరు పిల్లలను చంపిన భార్యాభర్తలు ఆ తర్వాత ఉరేసుకున్నారు.. మరో దారి లేక చనిపోతున్నాం.. క్షమించండి అంటూ.. చనిపోయిన చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో సూసైడ్ లేఖ కలకలం రేపింది.
ఓయూ పీఎస్ పరిధిలోని హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఈ ఘటన జరిగింది. ఆర్థిక సమస్యలే కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందని ఓయూ సీఐ రాజేందర్ పేర్కొన్నారు. హబ్సిగూడలోని రవీంద్రనగర్ కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని రాత్రి 9:30కు సమాచారం వచ్చిందన్నారు ఓయూ సీఐ రాజేందర్. భార్యాభర్తలిద్దరూ ఉరి వేసుకున్నారు… గతంలో ఓ ప్రైవేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా పని చేసి ఉద్యోగం మానేసిన చంద్రశేఖర్ రెడ్డి… అంతకుముందే వాళ్ల కుమార్తె, కుమారుడికి ఉరి వేసినట్లు ప్రాథమికంగా తేలిందని చెప్పారు. ఆర్థిక కష్టాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారన్నారు ఓయూ సీఐ రాజేందర్. చనిపోయిన వారిలో చంద్రశేఖర్ రెడ్డి, భార్య కవిత, కూతురు శ్రీత రెడ్డి 9వ తరగతి, కుమారుడు విశ్వాన్ ఐదో తరగతి… చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
మా చావుకు ఎవరు కారణం కాదు.. కెరీర్ అలాగే మానసికంగా అటు శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం.. వేరే మార్గం లేక చనిపోతున్నాం.. క్షమించండి అంటూ సూసైడ్ నోట్ రాశారు చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు.