నిజామాబాద్: రాష్ట్రంలోని గురుకులాల్లో నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 8 మంది బలవన్మరణం చెందారు. తాజాగా ఆర్మూర్ పట్టణంలోని గురుకుల కళాశాలలో ఇంటర్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థి గడ్డం సంతోశ్ (17) ఆత్మహత్య చేసుకున్నాడు. నేటి ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం తమతో లేచి, అందరితో కలిసి మెలిసి ఉన్నారన్నారు. కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం బయటకు వెళ్లిన సంతోశ్.. చెట్టుకు ఉరి వేసుకున్నట్లు తెలిపారు. మృతుడు నిజాంసాగర్ మండలం ఆరేపల్లికి చెందిన వాడిగా గుర్తించారు.
ఈ వార్తలను కూడా చదవండి…

