suicide | క్షమాపణ చెప్పాలి…

suicide | క్షమాపణ చెప్పాలి…

suicide | జనగామ, ఆంధ్రప్రభ : సీపీఎం పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టేషన్గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి(Kadiyam Srihari) బేషరతుగా క్షమాపణ చెప్పాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ రోజు జిల్లా కేంద్రంలో సీపీఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొన్నారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం చిల్పూర్ మండలం కిష్టాజిగుడంలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే(MLA) కడియం శ్రీహరి సీపీఎం పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బెశరత్తుగా సీపీఎం పార్టీ , పార్టీ శ్రేణులకు(party ranks) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లింగాల గణపురం మండలం సీపీఎం మండల కార్యదర్శి కుటుంబంపై దాడి చేసిన బీఆర్ఎస్ గుండాలను శిక్షించాలి అని తెలిపారు.

ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎవరికైనా సపోర్ట్ చేసే అవకాశం ఆ పార్టీకి ఉంటుందన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతామని భయంతో మండల కార్యదర్శి కుటుంబంపై దాడి చేయడంతో మండల కార్యదర్శి భార్య అయినా బొడ్డు ఉపేంద్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య(suicide) ప్రయత్నం చేయడం జరిగిందన్నారు.

ఆత్మహత్య యత్నం చేసుకున్న ఉపేంద్రను జిల్లా ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది అని, దాడి చేసిన వారిపై పిటిషన్(petition) ఇచ్చిన లింగాల గణపురం ఎస్సై వారిపై కేసు నమోదు చేయకుండా బీఆర్ఎస్ కు సహకరించే ప్రయత్నం చేస్తున్నా , ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మోకు కనుక రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, అహల్య సాంబరాజు, బోట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply