Suicide | యువతి ఆత్మహత్య

Suicide | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా వెల్లమిల్లి పంచాయతీ చింతాయిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. టీ పెట్టలేదని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన అనూష (22) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూడగా, ఆమె ఫ్యాన్ ను చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
