Suicide | ఆసుపత్రి పై నుండి దూకిన యువకుడు…

Suicide | గుడివాడ‌, ఆంధ్ర‌ప్ర‌భ : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రి భవనం పై నుంచి దూకి ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన నందివాడలో ఈ రోజు చోటు చేసుకుంది. పాత రామాపురానికి చెందిన ప్రవీణ్ మద్యానికి బానిసై ఈ సూసైడ్‌ కు యత్నించాడు. ప్రవీణ్‌ అనారోగ్యం బారిన పడడంతో త‌న తండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. తనకు వైద్యం వద్దని ఆసుపత్రి పై భవనానికి ఎక్కి దూకాడు. స్వల్పగాయాలతో బయటపడగా క్షతగాత్రుడ్ని ఎమర్జెన్సీ వార్డుకు వైద్యులు తరలించారు.

Leave a Reply