suicide | సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగిన వెంకన్న..

suicide | సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగిన వెంకన్న..
suicide | బూర్గంపాడు, ఆంధ్రప్రభః భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక మేడే కాలనీలో నివసిస్తున్న లాకవత్ వెంకన్న అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
గతంలో సారపాకలో ఆటో నడుపుతూ జీవనం సాగించిన వెంకన్న, ఉపాధి కోసం హైదరాబాద్ కు వెళ్లి కారు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఈ మధ్య తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై బార్య ను నిలదీయడంతో తనపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారని ఆరోపణలు తీవ్ర మనస్తాపానికి గురైన వెంకన్న మంగళవారం సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు సేవించినట్లు సమాచారం. అతడిని వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
