Suicide | యువకుడి ఆత్మహత్య…

Suicide | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ప్రేమ విఫలమైందని యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో చోటుచేసుకుంది. చిట్టీనగర్‌లో ప్రియురాలు తన ప్రేమను అంగీకరించలేదన్న మనోవేదనతో యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
యువతికి యశ్వంత్ కంటే ఎక్కువ వయసు ఉండటంతో ఇరువైపుల కుటుంబాలు ప్రేమను అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల యువతికి వివాహం ఖరారు కావడంతో యశ్వంత్ తీవ్ర మనస్తాపానికి గురై, స్నేహితుడికి లేఖ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
