కల్యాణానికి ముస్తాబైన సుద్దాల రామాలయం..

కల్యాణానికి ముస్తాబైన సుద్దాల రామాలయం..
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుద్దాల గ్రామా సీతా రామచంద్ర స్వామి ఆలయంలో శుక్రవారం జరుగనున్న సీతారామా కళ్యాణ మహోత్సవానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం (27/3/2026) రోజు ఉదయం 10:30 నిమిషాలకు అభిజిత్ లగ్న పుష్కారాంశ శుభలగ్న ముహూర్తంన సీతారామ కళ్యాణం కనుల విందుగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరైస్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు కోరారు. కల్యాణ అనంతరం తీర్థ ప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

