Lord|సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భారీగా ఆదాయం

Lord|సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భారీగా ఆదాయం

వివిధ సేవా రుసుముల ద్వారా 30 లక్షల ఆదాయం


కృష్ణా, ఆంధ్రప్రభ ప్రతినిధి : కృష్ణా జిల్లా (Krishna District) లోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజుల్లుతున్న మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (Sri Subrahmanyeshwara Swamy) వారి దర్శనానికి ప్రతినిత్యం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పలు దేశాలకు చెందిన భక్తులు సైతం స్వామివారిని దర్శించుకుని ఆది, మంగళవారాల్లో ప్రత్యేక పూజలను నిర్వహిస్తుంటారు.

వివిధ సేవా రుసుముల ద్వారా ఆది, సోమ మంగళవారాల్లో (10, 11, 12 తేదీల్లో ) రూ.30లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు (Dasari Srirama Varaprasada Rao) బుధవారం తెలిపారు. స్వామివారి దర్శనం చేసుకుంటే పుణ్యఫలం లభిస్తుందని, ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందన్న విశ్వాసంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు సైతం స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అందుకు తగినట్లుగా భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తుంటారు.


మోపిదేవి (Mopidevi) లోని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ( (Sri Subrahmanyeshwara Swamy) వారి దేవాలయంలో ఈనెల 10, 11, 12 తేదీల్లో వివిధ సేవా రుసుమల ద్వారా 30 లక్షల 42 వేల 343లు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 10వ తేదీ ఆదివారం 12,24,960 రూపాయలు, సోమవారం 6,51, 665 రూపాయలు, మంగళవారం 11,65,718 రూపాయలు వచ్చినట్టు తెలిపారు.

అభిషేకాలు, పుట్టు పోగులు, తలనీలాలు, అన్నప్రాసన, పాల పొంగళ్ళు, నిత్య కళ్యాణం, రుద్రాభిషేకాలు, పుట్టలో పాలు పోయుట, రాహు కేతు పూజ ( దోష నివారణ) పూజల నిమిత్తం ఈ ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో వివరించారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు.

Leave a Reply