ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఘన సన్మానం

మక్తల్, ఆంధ్రప్రభ ; ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ గా పనిచేస్తూ ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొంది ఉప సర్పంచ్ వార్డు సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన ఫోటోగ్రాఫర్లను మక్తల్ ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా సన్మానించారు. ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నెలవారి సమావేశంలో భాగంగా ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీ మోనేశ్వర స్వామి దేవాలయంలో అధ్యక్షులు బాలరాజ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా గెలుపొంది మక్తల్ మండలంలోని అనుగొండ గ్రామ ఉపసర్పంచ్ గా ఎన్నికైన నెంబర్ తిరుపతి, సంగంబండ గ్రామ ఉపసర్పంచ్ గా ఎన్నికైన సురేష్ తో పాటు గుర్లపల్లి వార్డు సభ్యుడుగా ఎంపికైన వెంకటేష్, పంచలింగాల వార్డు సభ్యుడుగా ఎన్నికైన ఆంజనేయులు లను శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఫోటో వీడియోగ్రఫీ ద్వారా సేవ చేస్తూ గ్రామాల్లో ప్రజల మద్దతుతో ప్రజాసేవ కోసం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ఫోటోగ్రాఫర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు సూచించారు .ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వి. శ్రీనివాస్ ఆచారి, కె .పాపిరెడ్డి,ఆడెం రాఘవేందర్,అశోక్ రెడ్డి,రంకుల అశోక్, మైబు,గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply