students | మధ్యాన్న భోజనం పరిశీలించిన సబ్ కలెక్టర్

students | మధ్యాన్న భోజనం పరిశీలించిన సబ్ కలెక్టర్
students | బోధన్, ఆంధ్ర ప్రభ : వర్ని మండలం జాకోర గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాన్న భోజనాన్ని సబ్ కలెక్టర్ వికాస్ మహాతో పరిశీలించారు. నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాల లోని మూడవ తరగతి విద్యార్థుల ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సామర్థ్యాలను పరిశీలిoచారు.
విద్యార్థుల అభ్యాస ఫలితాలను అంచనా వేశారు. విద్యార్థుల అభ్యాస స్థాయిలు సంతృప్తికరంగా లేవని అన్నారు.పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థుల అభ్యాసన ఫలితాలు మెరుగుపడేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.అయన వెంట తహసీల్దార్ సాయిలు, విద్యాశాఖ ఆధికారి సాయిలు తదితరులు ఉన్నారు.
