పీఎం శ్రీ జిల్లా స్థాయి క్రీడల్లో విద్యార్థిల ప్రతిభ

జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం వరకు జరిగిన పీఎం శ్రీ జిల్లా స్థాయి క్రీడల్లో జైనూర్ బాలికల అశ్రమోన్నత పాఠశాల విద్యార్థిలు ప్రతిభ కనబరిచారని జైనూర్ బాలికల అశ్రమోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పార్వతి ఆదివారం తెలిపారు. పీఎం శ్రీ పాఠశాలల బాలికల జిల్లా స్థాయి పోటీల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థిలు కబడ్డీ పోటీలో జిల్లాస్థాయి ప్రధమ బహుమతి గెలుపు పొందారని కోకో పోటీలో జిల్లా స్థాయి రెండవ బహుమతి కైవసం చేసుకున్నారని హెచ్ఎం పార్వతి తెలిపారు. బహుమతులు కైవసం చేసుకున్న విద్యార్థినిలకు కప్పుతో పాటు బహుమతి అందుకున్నారని తమ పాఠశాలకు చెందిన విద్యార్థినిలు కబడ్డీ కోకో పోటీల్లో జిల్లా స్థాయి బహుమతులు పొందడం ఎంతో సంతోషంగా ఉందని హెచ్ఎం తో పాటు పిఈటి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply