ఉన్నత లక్ష్యాలతో విద్యార్థులు ఎదగాలి..

ఆలేరు, ఆంధ్రప్రభ : ఉన్నత లక్ష్యాలతో నిరంతర విద్యాసాధనతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని శ్రీ రామకృష్ణ విద్యాలయం 42వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను గమనిస్తూ, నైపుణ్యాలను పోటీ ప్రపంచానికి అనుగుణంగా అభివృద్ధి పరచుకుంటూ విద్యార్థులు ముందుకు సాగితే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆమె తెలిపారు. కార్యక్రమానికి ప్రధానాచార్యులు బండిరాజుల శంకర్ అధ్యక్షత వహించారు. సుధాకర్ రెడ్డి ఉపన్యాసించారు. బీజన భాస్కర్, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రమేష్, ఆచార్యులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు పాల్గొన్నారు. పాఠశాల పక్షాన అతిథి సత్కారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Leave a Reply