ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ జిల్లా భూపాలపల్లి (Bhupalpalli) మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీ (Subhash Colony) గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం కలుషిత నీరు (Contaminated water) తాగి 11మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
వీరిని హుటాహుటిన జిల్లా కేంద్రంలోని వంద పడకల హాస్పిటల్ (Hundred bed hospital) కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు (Doctors) తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సీఐ నరేష్ కుమార్ లు ఆస్పత్రికి చేరుకుని విద్యార్థుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.