Students | క్రీడల్లోనూ రాణించాలి…

Students | క్రీడల్లోనూ రాణించాలి…
డోన్ ఎమ్మెల్యే కోట్ల..
Students | డోన్, ఆంధ్రప్రభ : విద్యార్థినీ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని డోన్ ఎమ్మెల్యే (Mla) కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. ఇవాళ పట్టణ సమీపంలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డోన్ సబ్ డివిజన్ పరిధిలోని డోన్, బేతంచెర్ల, ప్యాపిలి, బనగానపల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల చేత డివిజనల్ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యంగా టీచర్లు (Teachers) విద్యార్థినీ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో కూడా ఆసక్తి కలిగిన వారిని గుర్తించి వారికి నైపుణ్యం కనబరిచే విధంగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అదేవిధంగా డోన్, బేతంచెర్ల, ప్యాపిలి ప్రాంతాల్లో ఉన్నవారు ఉపాధ్యాయుల సమస్యలు ఏమైనా ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు.
అదేవిధంగా విద్యార్థులు చదువులో ఒక గోల్ (GOL) ని ఎంచుకోవాలి.. సాధించాలనే పట్టుదలతో చదివి క్రమశిక్షణతో మెలిగి ఉన్నత స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఇటువంటి మాస్ అసెంబ్లీలో డోన్ కు చెందిన విద్యార్థిని అసెంబ్లీలో చక్కగా ప్రసంగించారు. అటువంటి విద్యార్థినీలు రాజకీయాల్లో కూడా రాణించాలని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు లక్క సాగరం లక్ష్మారెడ్డి, చండ్రపల్లి లక్ష్మీనారాయణ యాదవ్, రాష్ట్ర వాల్మీకి డైరెక్టర్ వలసల రామకృష్ణ, రాష్ట్ర బెస్త డైరెక్టర్, ప్రజా వైద్యశాల మల్లికార్జున
అర్జున్ రెడ్డి, వెంకటంపల్లి శ్రీనివాస్ యాదవ్(Srinivas Yadav), ఉడమలపాడు రామాంజనేయులు, డిప్యూటీ డీఈవో ఎస్ వెంకటరామిరెడ్డి, డోన్ ఎంఈఓ ప్రభాకర్, ప్యాపిలి, బేతంచెర్ల, అవుకు, బనగానపల్లెకు చెందిన మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
