విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి…

విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని త్రిప్రాస్, పల్లి సర్పంచ్ విజయలక్ష్మి నరసింహ అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని త్రిప్రాస్ పల్లిలో స్ఫూర్తి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ ఎస్ ఎస్ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సేవ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పనిచేయడంవల్ల గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై పట్టు సాధిస్తారని అన్నారు.
ఎన్ఎస్ఎస్ కార్యక్రమం పేరుతో గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. తమ గ్రామంలో విద్యార్థులు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. విద్యార్థులు సామాజిక సేవచేపట్టడం వల్ల భవిష్యత్తులో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని విరివిగా చేపట్టాలన్నారు. అనంతరం డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం సర్పంచ్, ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలోకళాశాల ప్రిన్సిపాల్ పద్మ, పంచాయతీ కార్యదర్శి అశోక్ గౌడ్, ఎన్ఎస్ఎస్ అధికారి అర్జున్ గణప కళాశాల అధ్యాపకులు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
