Students | సెలవు రోజుల్లో కూడా కాలేజీలు..

Students | సెలవు రోజుల్లో కూడా కాలేజీలు..
Students | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ఎదుట పీడీఎస్‌యూ నాయకులు ఆందోళనకు దిగారు. సెలవు రోజుల్లో కూడా కాలేజీలు నిర్వహిస్తున్నారంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులపై అనవసర ఒత్తిడి పెంచుతూ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి సంబంధిత కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధరణా చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని, నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పీడీఎస్‌యూ నాయకులు ఇంటర్ బోర్డును కోరారు. పరిస్థితిపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.
