మధ్యాహ్నం భోజనం తనికి చేసిన కలెక్టర్…

మధ్యాహ్నం భోజనం తనికి చేసిన కలెక్టర్…
కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…
బూర్గంపాడు, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను మంగళ వారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన పాఠశాల ఆవరణ ను పరిశీలించి పాఠశాలలోని రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యత గల ఆహారం అందించి వారి ఆరోగ్యానికి దోహద పడాలి అని విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుల్లో రాణిస్తారు అని అన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించకపోతే చర్యలు తప్పవని అన్నారు. మెనూ ప్రకారం భోజనం అందే విధంగా చూడాలని తహసీల్దార్ ప్రసాద్ ను ఆదేశించారు. హాస్టల్ లో వసతుల పై విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. కలెక్టర్ తో పాటు మండల తహసీల్దార్ ప్రసాద్, ఎంపిడిఓ జమలా రెడ్డి, అదేవిధంగా గ్రామ ఉపసర్పంచ్ గుండె వెంకన్న తదితరులు ఉన్నారు.
