Students | కంప్లైంట్ బాక్స్‌ల ఏర్పాటు..

Students | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం కోనాపూర్ ఉన్నత పాఠశాలలో బాలికా సాధికారత, కౌమార రక్షణ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఈవ్ టీజింగ్, ఇతర సమస్యల కోసం మధ్యాహ్న భోజన(afternoon Lunch) పథకంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం సోమవారం కంప్లైంట్ బాక్స్ ల ఏర్పాటు చేశారు. క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కంప్లైంట్ బాక్స్ తెరిచి సమస్యలకు పరిష్కారం సూపిస్తారని ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్ తెలిపారు. పాఠశాల స్థాయిలో పరిష్కరించే సమస్యలు సంబంధితుల తల్లిదండ్రులకు(To the parents) తెలిపి పరిష్కరించడం జరుగుతుందని, తీవ్రమైన సమస్యలు కమ్మర్ పల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల తమ పేర్లు రాయకుండా సమస్యలు రాసి రహస్యంగా బాక్స్ లో వేసే ఏర్పాటు చేశారని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Students

Leave a Reply