Students | విద్యతోనే అభివృద్ధి…

Students | విద్యతోనే అభివృద్ధి…
Students | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని వల్లంపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని వల్లంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దాత సహకారంతో విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధనలు చేపట్టడం వల్ల విద్యార్థులు చదువుతో పాటు వివిధ రంగాల్లో రాణించవచ్చని అన్నారు. మడుగు కాశీనాథ్ కుమారుడు దివంగత మడుగు కార్తీక్ జ్ఞాపకార్థం విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారని అన్నారు. తమ కుమారుడి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఇందిరా దేవి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
