STUDENTS | వికాస్ పాఠశాలలో ఘనంగా ఫ్రూట్స్ డే వేడుకలు

STUDENTS | వికాస్ పాఠశాలలో ఘనంగా ఫ్రూట్స్ డే వేడుకలు


STUDENTS |: తొర్రూరు డివిజన్ లోని వెలికట్ట శివారులో ఉన్న వికాస్ హైస్కూల్ లో శనివారం ఫ్రూట్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు రకరకాల పండ్లతో అనేక రకాలుగా కుందేలు, జింక, హంస, తాబేలు, గొడుగు, తామర పువ్వు, ఎలుక, వినాయకుడు, ఆక్టోపస్, డాల్ఫిన్, పాండా వంటి అనేక రకాల ఆకృతులను తయారు చేసి ప్రదర్శించారు.

అనంతరం పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ మాట్లాడుతూ… ప్రతిరోజు పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, సీజనల్ గా లభించే పండ్లను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ప్రతి పండులో రకరకాల పోషకాలు, విటమిన్లు మనిషికి అందుతాయని తెలిపారు. ప్రస్తుత హడావుడి జీవన విధానంలో ఫలాలు మనకు ఎంతో అవసరమని, వాటిలో ఉండే విటమిన్లు, ఫైబర్స్ మనకు ఎంతగానో ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు కేవీ రెడ్డి, శ్రీలత, ప్రిన్సిపాల్ నాగరాజు, వేణుమాధవ్, వైస్ ప్రిన్సిపాల్ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply