students | విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలి…

students | విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలి…

students | కడెం, ఆంధ్రప్రభ : గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పోషకాహారం అందించాల్సిందిగా ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మార్మాట్ అధికారులను ఆదేశించారు. సోమవారం కడెం గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, భోజన ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో ముచ్చటించి భోజన నాణ్యత, సమయపాలనపై ప్రశ్నించారు.

వండిన ఆహారాన్ని పరిశీలించి కంప్యూటర్ ల్యాబ్‌ను తనిఖీ చేశారు. కడెం ఆశ్రమ పాఠశాలలో 170 మంది విద్యార్థుల్లో 115 మంది మాత్రమే హాజరై ఉండగా, హాజరు నమోదు తప్పుడు విధంగా చేయడంపై వార్డెన్‌ను హెచ్చరించారు. ప్రతి రోజు మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.

దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు నివారించేందుకు వసతి గృహాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వంటగది, స్టోర్ రూమ్, తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని సూచించారు. తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పి, సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply