విద్యార్థిని ఆత్మహత్య..

  • తల్లిదండ్రులకు గర్భశోకం

అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : ఎంతో ఉన్నత ఆశయాలతో తల్లిదండ్రుల రెక్కల కష్టం మరిచిపోయి పిల్లలను కార్పొరేట్ కళాశాలలో చేర్పిస్తే.. వారిలో కొందరు వెనుక ముందు ఆలోచించకుండా అర్ధాంతరంగా తమ జీవితాలను ఉరికంబానికి ఎక్కిస్తున్నారు. తల్లిదండ్రులకు గర్భకోశాన్ని మిగులుచుతున్నారు. తాజాగా ఎస్ఆర్ఐటి కళాశాలలో ఇంజనీరింగ్ చెబుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలచివేసింది.

తమ పిల్లలు తమలాగా పొలాల వెంబడి కూలీ బ్రతుకులు బతకకుండా… ఉన్నత ఉద్యోగాలతో సుఖంగా జీవించాలని తాపాత్రపడే తల్లిదండ్రుల ఆశలపై కొందరు పిల్లలు నీళ్లు చల్లుతున్నారు. వీరి చావుల వెనక అనేక కారణాలు వినిపిస్తుంటాయి. కొందరు కళాశాలల యాజమాన్యాలు ఫీజులు ఇతరత్రా విషయాలలో వేధింపుల కారణంగానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుంటాయి. మరోవైపు చదువులో ఒత్తిడి, ఇతర మానసిక సమస్యల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కళాశాల యాజమాన్యాలు చెబుతుంటాయి.

నారాయణ కళాశాలలో ఆ మధ్యలో బత్తలపల్లి కి చెందిన ఒక విద్యార్థి మూడవ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మ చేస్తున్నాడు. ఫీజుల వేధింపు వల్లనే తమ కుమారుడు ఆత్మ చేసుకున్నాడని తల్లిదండ్రులు నేరుగా ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరి పైన ఎటువంటి చర్యలు తీసుకున్నట్లు దాఖలాలు కనిపించలేదు. తాజాగా బుక్కరాయసముద్రం మండల పరిధిలో ఎస్ఆర్ఐటి కళాశాలలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న ధనలక్ష్మి(20) అనే విద్యార్థిని ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఉండటానికి గమనించిన తోటి విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు.
పోలీసులకు సమాచారంఅందించారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు.

ఈమె తల్లిదండ్రులు పెనుగొండ పట్టణంలోని ఒగ్గు కుంట సమీపంలో ఉంటారు. పాల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. పెద్దమ్మాయి బిటెక్ పూర్తి చేసి ఇంట్లో ఉండగా… ఈమె అనంతపురంలో ఎస్ఆర్ఐటిలో చదువుతోంది. మంగళవారం సాయంత్రం ఎన్సీసీ క్యాంపుకు వెళ్లిన తర్వాత రూమ్కు వచ్చి ఆత్మహత్య చేసుకుంది. అక్కడ ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా అన్నది తెలియాల్సి ఉంది.

Leave a Reply