విమానం ఇంజిన్‌లో ఇరుక్కున్న‌…..

  • 103 మంది ఊపిరిపీల్చుకున్నారు

విశాఖపట్నం నుండి హైదరాబాద్‌ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే ఒక పక్షి ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. దీంతో విమానం రెక్కలు దెబ్బతిన్నాయి.

అయితే అప్రమత్తంగా స్పందించిన పైలట్‌ వెంటనే పరిస్థితిని అర్థం చేసుకుని చాకచక్యంగా నిర్ణయం తీసుకున్నాడు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విమానాన్ని తిరిగి విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు.

ఈ ఘటన సమయంలో విమానంలో 103 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా ఏర్పడిన ప్రమాదాన్ని త్రుటిలో తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply