strike l ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను పాల్గొని విజయవంతం చేద్దాం..

strike l ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను పాల్గొని విజయవంతం చేద్దాం..
కోడూరు, ఆంధ్రప్రభః కార్మికులను యజమానులకు కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శివ నాగేంద్రం అన్నారు. కోడూరులోని మార్క్సిస్టు విజ్ఞాన భవనం నందు ఫిబ్రవరి 12న జరగబోయే దేశవ్యాప్త సమ్మె కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శివ నాగేంద్రం మాట్లాడుతూ ఢిల్లీ రైతాంగ ఉద్యమం విరమణ సందర్భంగా దేశ ప్రధాని మోడీ రైతాంగానికి క్షమాపణ చెప్పి మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తున్నామని విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని, రైతుకు గిట్టుబాటు ధర అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎటువంటి హామీని నెరవేర్చకుండా రైతాంగానికి దోహం చేస్తున్నారన్నారు.
కార్పొరేట్ల ప్రయోజనం కోసం మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ తెచ్చి పని గంటలు 8 నుండి 12 కు పెంచి అదనపు జీతం కూడా చెల్లించకుండా కనీస వేతనాలు కోసం కార్మికులు బేరసారాలు ఆడే హక్కు హరించిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శీలం నారాయణరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కరిముల్లా, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు సింగోతు నాగేంద్రం, సిఐటియు మండల కార్యదర్శి విక్టోరియా, రైతు సంఘం నాయకులు ఆవుల బసవయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పోలాబత్తిన మోహన్రావు, బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు బొర్రా వెంకటేశ్వరావు, జరుగు గిరి, చెక్క వెంకటేశ్వరరావు, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, వివోలు తదితరులు పాల్గొన్నారు.
