Kammarpally రూల్స్ త‌ప్పితే క‌ఠిన చ‌ర్య‌లే…

Kammarpally రూల్స్ త‌ప్పితే క‌ఠిన చ‌ర్య‌లే…

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10 వేలు జరిమానా(Fine of Rs. 10 thousand), 6 నెలల జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు చేయనుండగా, రెండవ సారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే రూ.15 వేలు జరిమానా, 6 నెలల జైలు శిక్ష, వాహనం సీజ్ చేసి, జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని కమ్మర్ పల్లి ఎస్ఐ జి. అనిల్ రెడ్డి(Kammarpally SI G. Anil Reddy) ఈ రోజు హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పలు కఠిన నిబంధ‌న‌ల‌ను, జరిమానాలను, శిక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్(rash driving, triple riding) చేస్తే జరిమానాలతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వాహనాలకు సంబంధిత ద్రువ పత్రాలు, లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోయినా జరిమాన తప్పదని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, ఇచ్చిన వారిపై కేసు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు చేపడతామని ఎస్ఐ జి.అనిల్ రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply