Jannaram | గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు : సీఐ రమణమూర్తి

జన్నారం, జులై 19 (ఆంధ్రప్రభ): గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని లక్షేటి పేట (Lakshettipet) సీఐ రమణమూర్తి (CI Ramanamurthy) అన్నారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా (Amber Kishore Jha) ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ భాస్కర్ (Bhaskar), ఏసీపీ ప్రకాష్ పర్యవేక్షణలో మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ గ్రామపంచాయతీ లోని గాంధీ నగర్ లో శనివారం ఉదయం గార్డెన్స్ సెర్చ్ నిర్వహించారు.

ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ… శాంతి భద్రతల నిర్మూలనలో భాగంగా గంజాయి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. గంజాయి, గుడుంబా విక్రయించినా, సేవించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. గంజాయి విక్రయించినట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. ముఖ్యంగా యువకులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలను చైతన్యపరచాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష, దండేపల్లి ఎస్సై తహసీనొద్దీన్, లక్షేట్టిపేట అదనపు ఎస్సై రామన్న, లక్షేటిపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్సై జి.మౌనిక, అటవీ శాఖ, ఎక్సైజ్, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply