భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్న ఆర్బీఐ గవర్నర్ (RBI Governor) సంజయ్ మల్హోత్రా ప్రకటనతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల దారిలోనే కొనసాగింది.

భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, స్థిరంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) చేసిన ప్రకటన మదుపర్లలో ఆత్మవిశ్వాసం నింపింది. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ సూచీలు లాభాల బాటలోనే పయనించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా లాభాల్లోనే (profits) పయనించాయి. అంతర్జాతీయంగా సానుకూలాంశాలు కూడా కలిసి రావడంతో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా నాలుగో రోజు కూడా లాభాలను ఆర్జించాయి.

ముందు రోజు ముగింపు (81, 857)తో పోల్చుకుంటే గురువారం ఉదయం 350 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ (Sensex) రోజంతా నష్టాల్లోనే కదలాడింది. గురువారం సెన్సెక్స్ 81, 921-82,231 మధ్యలో శ్రేణి కదలాడింది. చివరకు సెన్సెక్స్ 142 పాయింట్ల లాభంతో 80, 000 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ (Nifty) కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 33 పాయింట్ల లాభంతో 25, 083 వద్ద స్థిరపడింది.

Leave a Reply