ముంబై: దేశీయ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో మన సూచీలు లాభాల బాటలో ఉన్నాయి. ఒడుదొడుకుల మధ్య నిన్న ట్రేడింగ్ సాగినా నేడు అవి పుంజుకున్నాయి.ఉదయం 9.34 గంటల సమయంలో సెన్సెక్స్ 180 పాయింట్లు పుంజుకొని 82,363 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50.5 పాయింట్ల లాభంతో 25,110 దగ్గర కొనసాగుతోంది.
నిఫ్టీ సూచీలో టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, జియో ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ కంపెనీ, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టెక్ మహీంద్రా స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.