STATUE | సేవలు మరువలేనివి..
- మండలికి ఘన నివాళులు
STATUE | నాగాయలంక, ఆంధ్రప్రభ : స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా నాగాయలంకలో 132వ రోజు నివాళులర్పించారు. సాయిబాబా గుడి (Saibaba temple) సమీపంలో మండలి కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి నిర్వహణ కమిటీ సభ్యులు బీజేపీ నాయకులు చెన్నగిరి లతా మోహన్, ఆర్డీటీ ఎంఈఓ తలశిల రామకృష్ణలు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. దివిసీమ పునఃనిర్మాత, తెలుగు జాతి రత్నం స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు ఎనలేని సేవలు చేశారని తెలిపారు. జనసేన నాయకులు బండ్రెడ్డి హరి, రేమాల బాబు రావు, తానంకి చంటి, మర్రిపాలెం బండ్రెడ్డి బోసు, సనకా శేషు, బోగాధి కరుణాకర్, తోట రత్నరావు, తలశిల శివశంకర్, షేక్ జానీ, తలశిల రాఘవరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

