వార్డును అభివృద్ధి చేసి చూపిస్తాను

వార్డును అభివృద్ధి చేసి చూపిస్తాను

  • కాంగ్రెస్ అభ్యర్థి గుర్రం హైమ రమేష్

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : మీ ఇంటి బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వండి..వార్డులో అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి గుర్రం హైమ రమేష్ హామీ ఇచ్చారు. నిరంతరం ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తూ, గెలిచిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేస్తానని తెలిపారు. గురువారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భాగంగా 3వ వార్డులోని పలు సమస్యలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్రం హైమ రమేష్ కాలనీ వాసులకు కీలక హామీలు ఇచ్చారు. వార్డు అభివృద్ధే తన ధ్యేయమని ఈ సంద ర్భంగా ఆమె స్పష్టం చేశారు. వివర్స్ కాలనీలో మౌలిక సదుపాయాలు సరిగా లేవని పేర్కొన్నారు.

గెలిచిన వెంటనే అక్కడి సమస్యల పరి ష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. మొదటి ప్రాధాన్యతగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందచేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మోరీలు, వీధి దీపాల ఏర్పాటు చేపడతామని తెలిపారు. వార్డులో అంగన్వాడీ భవనం నిర్మాణం కూడా చేపడతామని పేర్కొన్నారు. గెలి చిన తర్వాత దాదాపు వార్డులో 30 నుంచి 50 వరకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని, అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహాలు అందేలా చూస్తానన్నారు. రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్‌, పింఛన్ల మంజూరులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసు కుంటామని చెప్పారు. అలాగే యువతకు క్రీడల్లో ప్రోత్సాహం అందిస్తా మని ఆమె హామీ ఇచ్చారు. 3వ వార్డులో కాంగ్రెస్ జెండా గెలుపు ఖాయ మని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ లు నాగర బోయి న శ్రీరాములు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply