State level | రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

State level | రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

State level | సిరికొండ, ఆంధ్రప్రభ : రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తుంపల్లి పాఠశాలకు చెందిన. 9 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు పీడీ సడక్ నగేష్ తెలిపారు. పీడీ అందించిన వివరాల ప్రకారం. రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఉమ్మడి జిల్లాల క్రీడాకారుల కు నిర్వహించిన ఎంపిక పోటీలలో. తుంపల్లి పాఠశాలకు చెందిన క్రీడాకారులు.

ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్లు ఆయన చెప్పారు. ఈ నెల 8 నుంచి 10 వరకు వనపర్తి జిల్లాలో నిర్వహించనున్న. రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో 9 మంది విద్యార్థులు పాల్గొంటారని ఆయన తెలిపారు. రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ఎంఈఓ రాములు, సర్పంచ్ రాజేందర్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, అభినందించినట్లు ఆయన పేర్కొన్నాడు.

Leave a Reply