State level cricket competitions | మక్తల్ శ్రీ గీతం విద్యార్థి

State level cricket competitions | మక్తల్ శ్రీ గీతం విద్యార్థి
ఉమ్మడి జిల్లా కెప్టెన్ గా గౌతమ్ చంద్ర
గౌతమ్ చంద్ర కు ఘనంగా సన్మానం
State level cricket competitions | మక్తల్, ఆంధ్రప్రభ : వచ్చే నెల డిసెంబర్ లో భద్రాచలం లో జరుగనున్న అండర్ 14 క్రికెట్ పోటీలకు ఉమ్మడి జిల్లా కెప్టెన్ గా మక్తల్ శ్రీ గీతం పాఠశాల విద్యార్థి గౌతమ్ చంద్ర (Gautam Chandra) ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం మక్తల్ పట్టణంలోని శ్రీగీతం పాఠశాల వద్ద ప్రైవేటు పాఠశాలల సంఘం(ట్రస్మా)ఆధ్వర్యంలో గౌతమ్ చంద్రను డివైఎస్ఓ వెంకటేష్ శెట్టి, సీనియర్ బిఆర్ఎస్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేసి అభినందించారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… వెనుక బడిన పాలమూరు జిల్లా (Palamuru District) మక్తల్ ప్రాంతం నుండి గత కొన్ని నెలలు గా క్రికెట్ లో అద్భుతమైన ప్రతిభ కనపరుస్తున్న గౌతమ్ దంద్ర ను ఉమ్మడి జిల్లా కెప్టెన్ గా నియమించడం సంతోషకరమని అన్నారు.భవిష్యత్ లో ఈ విద్యార్థి అంచెలంచెలుగా ఎదిగి తాను చదువుతున్న పాఠశాల కు ఈ ప్రాంతానికి మరింత పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తొలిసారి ఈ ప్రాంతం నుండి అండర్ 14 క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం అందులోనూ జిల్లా కెప్టెన్గా ఎన్నికవ్వడం ఎంతో అభినందనీయమన్నారు.
ఇటీవల కాలంలో వివిధ క్రీడాంశాలలో మక్తల్ (Maktal) ప్రాంత విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొనడం జరిగిందన్నారు. క్రీడా రంగంలో అత్యంత ప్రాబల్యం కలిగిన క్రికెట్ పోటీలకు మక్తల్ పట్టణానికి చెందిన విద్యార్థి ఎంపిక కావడం గర్వకారణంగా ఉందన్నారు. భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ టీంలో ఎంపికై రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు శ్రీనివాస్ గుప్త, డివైఎస్ఓ వెంకటేష్ శెట్టి, సీనియర్ క్రికెటర్ లక్ష్మి నారాయణ, ప్రైవేట్ పాఠశాలల జనరల్ సెక్రటరీ అంజిరెడ్డి, ట్రస్మా సభ్యులు ఎస్.రమేష్ రావ్, సత్యనారాయణ గౌడ్, గీతం పాఠశాల పోషక కమిటీ అధ్యక్షులు మణికంఠ, పాఠశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
