బాధిత కుటుంబాలకు అండగా ఉంటా..

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా..

  • ఎస్ ఆర్ ఆర్ ఫౌండర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆంధ్రప్రభ : బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మైలారం గ్రామంలో ఓర్సు ఐలమ్మ, కోల నాగరాజు తండ్రి కోల సోమయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,మనోధైర్యం కల్పించారు.

అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్వింటా,50 కేజీల బియ్యం, ఆయిల్ క్యాన్ లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా తనతో చెప్పాలని వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, వార్డ్ నెంబర్ లు పరుపాటి రవీందర్ రెడ్డి, తాటికాయల కేతమ్మ, మండల పార్టీ ముఖ్య నాయకులు సంధి దేవేందర్ రెడ్డి, పెరటి యాదవ రెడ్డి, గుడెల్లి వెంకటయ్య, గబ్బేట కొమురయ్య, గబ్బేట యాకయ్య,

ఈదులకంటి సంపత్, బొమ్మినేని సురేందర్ రెడ్డి, లేతకుల యకూబ్ రెడ్డి, కోలా కుమార్, కోలా సంపత్, సంకినేని ఎల్లస్వామి, బాధ సుధాకర్, నందనబోయిన యాకయ్య, ముని, బాధ సంపత్, బోయిని చిన్న కుమార్, సుధీర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply