శ్రీశైలానికి 24 గంటలూ అనుమతి !

  • శివరాత్రి సందర్భంగా వెసులుబాటు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల‌ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఈ నెల 19 నుండి మార్చి 1 వరకు అటవీ శాఖ చెక్‌పోస్టుల్లో 24 గంటలూ అనుమతించనున్నారు. పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

అటవీ ప్రాంతంలోకి 2 నుండి 5 లీటర్‌ల వాటర్‌ బాటిళ్లు తీసుకెళ్లొచ్చని.. ఆ ప్లాస్టిక్‌ వ్యర్థాలు చెత్తకుండీల్లోనే వేయాలని కోరారు. సాధారణ రోజుల్లో రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు శ్రీశైలానికి రోడ్డు మార్గంలో వాహనాలను అనుమతించమని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *