శ్రీశైలం – ఎగువ నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం (srisailam ) ప్రాజెక్ట్ వద్ద కృష్ణమ్మ (krishanmma ) పరవళ్లు తొక్కుతున్నది.. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (chandrababu ) నేడు కృష్ణమ్మకు జల హారతులు (jala harathi ) ఇచ్చి, రైతుల హర్షద్వానాల మధ్య కృష్ణమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు 6, 7, 8, 11 నెంబర్ల రేడియల్ గేట్లను (redial gates ) తెరచి నీటిని దిగువకు వదిలారు. పరవళ్ళు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తున్న కృష్ణమ్మ నదిని చూసి ముఖ్యమంత్రి పులకరించి పోయారు.
ముందుగా ఆయన శ్రీశైలంలో జలాశయంలో జల హారతి కార్యక్రమంలో శ్రీశైలంకు చేరుకున్నారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం ద్వాదశాలలో రెండవ జ్యోతిర్లింగం, ఆరవ అష్టాదశ శక్తిపీఠం,ఇలలో వెలసిన కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనం చేసుకున్నారు.. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేదమంత్రాలతో స్వామివారి దర్శనార్థం ఆలయంలోకి తీసుకువెళ్లిన అర్చకులు.
ఆలయంలో ప్రధమంగా రత్నగర్భ గణపతిని , అనంతరం శ్రీశైల మల్లికార్జున స్వామిని, శ్రీ భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని అర్చన కార్యక్రమంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో రుద్ర హోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు చలవ నరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ న్యాయ శాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, దేవదాయ శాఖ సెక్రెటరీ వినయ్ చంద్, కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ జల వనరుల శాఖ సీఈ ఎస్.కబీర్ భాష, ఆలయ ఈవో శ్రీనివాసరావు, జేఈవో, పిఆర్వోలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.