Sriram | జాతీయ స్థాయి బాక్సింగ్ లో బంగారు పతకం

Sriram | జాతీయ స్థాయి బాక్సింగ్ లో బంగారు పతకం

Sriram | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన యువకుడు జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటి, బంగారు పథకం సాధించి పలువురి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఊట్కూర్ మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ మహారాష్ట్రలోని రాయఘడ్ జిల్లాలో జరిగిన 6వ జాతీయ స్థాయి మిక్స్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో అద్భుత ప్రతిభ కనబరిచారు.

ఈనెల 26 నుండి 28 వరకు జరిగిన పోటీల్లో శ్రీరామ్ తెలంగాణ రాష్ట్రం తరఫున విజేతగా నిలిచారు. మారుమూల చిన్న పల్లెలో జన్మించిన శ్రీరామ్ తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను జాతీయ స్థాయిలో చాటి బంగారు పతకం సాధించడంతో పుట్టిన ఊరితో పాటు జిల్లాకు పేరు తీసుకురావడంతో పలువురు అభినందించి సన్మానిస్తున్నారు. జాతీయ బాక్సింగ్ లో యువకుడు బంగారు పతకం సాధించడంతో క్రీడాభిమానులు అభినందిస్తున్నారు.

Leave a Reply