SRINU | ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

SRINU | ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

SRINU | రుద్రూర్, ఆంధ్రప్రభ : రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలోని శ్రీ స్వయంభూ బసవేశ్వర మందిరానికి వెళ్లే రహదారి ప‌క్కన ఉన్న ముళ్ల పొదల వద్ద ప్రమాదవశాత్తు ఎడపల్లి గ్రామ వాసి శ్రీను (Vaasi Srinu) అనే వ్యక్తి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీను గత కొద్ది సంవత్సరాల నుంచి కొందాపూర్ గ్రామంలో అత్త, మేనమామల వద్ద ఉంటూ లేబర్ పని చేస్తుండేవాడు. ఆ రహదారి గుండా వెళ్తుండగా మద్యం మత్తులో ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందినట్లు పేర్కొన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను చేరుకొని సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply