ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా శ్రీనివాస్

టేకుమట్ల, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన దొంతుల శ్రీనివాస్ నియమితులయ్యారు రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ కు, జిల్లా మండల కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన ఈ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు ప్రజలకు చేరువగా ఉండే విధంగా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు.
