శ్రీకాంతాచారి త్యాగాలు వెలకట్టలేనివి..

అచ్చంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణ త్యాగం చేసిన అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 16వ వర్ధంతి సందర్భంగా బుధవారం అచ్చంపేట పట్టణంలోని బస్టాండ్ ముందున్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద వివిధ సంఘాలు, విశ్వ బ్రాహ్మణ సమాజం నాయకులు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు కలిసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ… తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన శ్రీకాంతాచారి త్యాగం ఎప్పటికీ మర్చిపోలేనిదని, అతని ఆత్మత్యాగం ఉద్యమానికి ఊపిరి పోసిందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని తగిన రీతిలో గౌరవించలేకపోయింద ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు నామినేటెడ్ పదవి ఇచ్చి గౌరవించడమే కాక ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శంకరమ్మ కుటుంబానికి న్యాయం చేస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం నాయకులు కందుకూరి నాగరాజు, మిడ్జిల్లా మాధవాచారి, కపిలవాయి ఉమాశంకర్, డాక్టర్ విష్ణుమూర్తి, కాకునూరు శ్రీనివాసాచారి, రేసోజు మురళి, ఉప్పునుంతల శ్రీనివాస్ ఆచారి, కాసోజు వీరాచారి, దేవపూజ వినోద్, చేపూరి జంగా చారి శేఖర్, చింతోజు శ్రీనివాసులు, కొండూరు శేఖర్, ఉద్యమ నాయకులు మహబూబ్ అలీ, రమాకాంత్, తదితరులు పాల్గొన్నారు.
