Srikanth | ఆదర్శంగా అభివృద్ధి చేస్తా..

Srikanth | ఆదర్శంగా అభివృద్ధి చేస్తా..


Srikanth | రాజంపేట, ఆంధ్రప్రభ : ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని రాజంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీకాంత్ (Srikanth) కోరారు. గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సర్పంచిగా పోటీ చేయడం జరుగుతుందన్నారు. తమను గెలిపిస్తే ఆదర్శ గ్రామంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. యువత మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు తాను ఎల్లవేళలా అండగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తమపై నమ్మకంతో గ్రామ సర్పంచిగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎలాంటి సమస్యలున్నా.. తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply