Srikakulam | ఉపాధి హామీ పథకం రద్దు పై కాంగ్రెస్ పార్టీ నిరసన…

Srikakulam | ఉపాధి హామీ పథకం రద్దు పై కాంగ్రెస్ పార్టీ నిరసన…
Srikakulam | శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : ఏఐసిసి, పిసిసి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ రద్దు పై నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద చేపట్టారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు సనపల అన్నాజీ రావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో కనీస ఆర్థిక భరోసా లేని రైతు కూలీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకం తీసుకురావడం జరిగిందని, దీని ద్వారా కూలీలకు ఆర్థిక భరోసా కల్పించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా వలసల నివారణకు తోడ్పడే విధంగా చేపట్టారు, ఇంత మంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంను రద్దుచేసి కేంద్రంలో ఉన్న బిజెపి కూటమి ప్రభుత్వం వీబీ జీ రామ్ జీ అనే కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ఈ చట్టం వలన గ్రామీణ కూలీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు.
ఈ కొత్త చట్టం వలన ఉపాధి కూలీలకు పనిపై హక్కు కోల్పోయారని, కనీస వేతనాల పెరుగుదల వ్యత్యాసాలు సంవత్సరానికి కనీస వేతనంతో కూడుకున్న పని దినాల ఇవ్వడం జరగదని, గుత్తేదారుల చేతుల్లో ఉపాధి కూలీలు నలిగిపోతారని ఇప్పటివరకు కేంద్రం నుంచి వస్తున్న గ్రామ పంచాయతీల అభివృద్ధి నిధులు కేటాయింపులో వివక్షత చూపడం జరుగుతుందన్నారు. గతంలో 90శాతం శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరించేదని, రాష్ట్ర ప్రభుత్వం 10శాతం మాత్రమే ఇచ్చేదని, ఇప్పుడు 40శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించడం వల్ల ఆర్థిక భారం ఎక్కువై ఇది పరోక్షంగా మధ్య చిన్న తరగతి సన్నకారు రైతులు పై పడుతుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారంతో సతమతమవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు కోత వలన గ్రామపంచాయతీలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని, గ్రామీణ నిరుద్యోగాన్ని మరింత ఎక్కువ అవుటుందని తెలియజేస్తూ మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఈ పథకాన్ని రద్దు చేయడం అంటే ఈ దేశ ప్రజల మనోభావాలను, స్వాతంత్ర సమరయోధులను కించపరచడమేనని ఇది మంచి పరిణామం కాదని మేము భావిస్తున్నాం మన్నారు.
పాత పథకాన్ని మళ్లీ పునరుద్ధరించాలని శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జ్ గాదం వెంకట త్రినాధరావు, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రెల్ల సురేష్, కోత మధుసూదన రావు, కరిమజ్జి మల్లేశ్వరరావు, మాసుపత్రి చక్రవర్తి రెడ్డి, బొడ్డేపల్లి గోవింద్ గోపాల్, ఇజ్జురోతు రమణ, కే వి ఎల్ ఎస్ ఈశ్వరి, మామిడి సత్యనారాయణ, బచ్చ వెంకటరమణ,ఆబోతుల వెంకట్ నాయుడు, మజ్జి మురళీమోహన్, తెంబూరు మధుసూదన్ రావు, చాన్ బాషా, అంబటి దాలినాయుడు, దేశెల్ల గోవింద మల్లిబాబు, లఖినేని నారాయణరావు, లఖినేని సాయిరాం, గొల్లపల్లి దాలయ్య, పైల వాసుదేవరావు, గణపతి రావు దున్న దుర్యోధనరావు, సోడవరం చంద్రశేఖర రావు, సోడవరం లీలావతి, సూరియ బేగం,జి. రామారావు, జి. ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
