Srikakulam | వైసీపీ నేతల మాటలు హాస్యాస్పదం

Srikakulam | వైసీపీ నేతల మాటలు హాస్యాస్పదం

  • శాసనసభ్యులు గొండు శంకర్

Srikakulam | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : వైసీపీ నేతల మాటలు హాస్యాస్పదమని, వారి ఆలోచనలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని, వైసీపీ మాటల ప్రభుత్వమైతే, టీడీపీ చేతల ప్రభుత్వమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం, ఆమదాలవలస కొత్త రోడ్ పనులను శనివారం పర్యవేక్షించి మాట్లాడుతూ.. శ్రీకాకుళం, ఆముదాలవలస రోడ్డుకు కొత్తశోభ వస్తుందని, పండగ ముందు రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన నిధులలో పాలకొండ రోడ్ పనులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.8 కోట్లు విడుదల చేశారని, అందుకు జిల్లా ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలన్నారు. రెండు, మూడు రోజులలో పనులు ప్రారంభమౌతాయని, రూ.9 కోట్ల పాతబాకాయిలు పరిశీలనలో ఉందని, వీలైనంత తొందరలో అవి కూడా విడుదలవుతాయాన్నారు.

శ్రీకాకుళం జిల్లావాసులు చిరస్థాయి కల నెరవేరుతుందని, దీనికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు, ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవి కుమార్, శ్రీకాకుళం శాసనసభ్యునిగా నేను నిరంతరం కృషి చేస్తూ, అధిష్టానానికి తెలియజేసి నిధులు విడుదలలో ముఖ్య భూమిక పోషించామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్నతపదవులు పొందిన నేతలు, అధికారులు పూర్తిగా గాలికి వదిలేసి, ఎంతో మంది ప్రాణాలు పోవటానికి కారకులయ్యారని, అస్తవ్యస్తంగా ఉన్న ఈ రోడ్ పనులను, మా సొంత నిధులతో పనులు ప్రారంభించి, గత ప్రభుత్వ పాతబాకాయిలు సుమారు రూ.16 కోట్లు చెల్లించి, ఇప్పుడు మళ్ళీ నిధులు విడుదల చేసామని, 18 నెలలలో ఈ ఒక్క రోడ్ పనులకే 24 కోట్ల రూపాయిలు ఖర్చుచేస్తున్నామన్నారు.

నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ముఖ్యంగా నగరవాసులకు, ప్రయాణికులకు ఎంతో కాలంగా ఇబ్బందిగా మారిన శ్రీకాకుళం, ఆమదాలవలస, పాలకొండ రోడ్డు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, గత ప్రభుత్వ హయాంలో పనులు చేసి నిధులు అందక ఆగిపోయిన పనులను పునః ప్రారంభించి చివరదశకు చేరుకుందన్నారు శ్రీకాకుళం రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ మన నగరానికి అత్యంత ప్రాధాన్యత కలిగినదని, ​కల్వర్టుల నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులను ఎక్కడా జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు, నియోజకవర్గ శాసనసభ్యునిగా ఈ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

Leave a Reply