మార్కండేయుడిని దర్శించుకున్న శ్రీరామాలయం ట్రస్ట్ కమిటీ

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; గ్రేటర్ వరంగల్ లోని శివనగర్ శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయాన్ని 34 డివిజన్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ట్రస్ట్ కమిటీ సందర్శించారు. ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం కమిటీ కార్యవర్గ సభ్యులకు మార్కండేయ దేవాలయం అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వడ్నాల మల్లయ్య, కన్వీనర్ వడ్నాల సదానందం స్వాగతం పలికారు. పూజారులు వారిచే మహా శివుడికి పూజలు, అభిషేకం చేయించారు.ఈ సందర్భంగా రామాలయం ట్రస్ట్ , ప్రధాన కార్యదర్శి మంచాల కృష్ణమూర్తి, శ్రీరాంరాజేష్, మాట్లాడుతూ దేవాలయంలో ప్రతిష్టించిన శివలింగం చూసి అబ్బురపడినారు. బ్రహ్మసూత్రం చే శివలింగాన్ని శిల్పి ఈ శివలింగాన్ని రూపొందించారు. బ్రహ్మసూత్రంతో ప్రతిష్టించిన శివలింగం మహిమాన్వితం కలిగి ఉంటుందని వారు అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రవీందర్, పగడాల సతీష్, బత్తుల నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply