చౌటుప్పల్‌లో వైభవంగా శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవం

చౌటుప్పల్‌లో వైభవంగా శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవం

స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి- లక్ష్మి దంపతులు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. ఈ వేడుకలకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి దంపతులు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి-లక్ష్మి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

అంతకుముందు స్థానిక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు, ప్రజా ప్రతినిధులతో కలిసి స్వామి వారి కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. అర్చక స్వాములు ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు. స్వామివారి కళ్యాణోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే దంపతులకు మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు, శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవ కమిటీ బృందం ఘన స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి, లింగోజీగూడెం గ్రామాల్లో నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి- లక్ష్మి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. దాతలకు, ప్రజా ప్రతినిధులకు, పాత్రికేయులకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమాల లో బీసీ సంఘం జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ దంపతులు, మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ దంపతులు, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం చైర్మన్ బొబ్బిళ్ళ మురళి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు పిల్లలమర్రి మధుసూదన్, ఎండి హన్ను, కొసనం రాకేష్ రెడ్డి, ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్, బత్తుల వాణి విప్లవ్, దేప రమ్య రాజు, పాక చిరంజీవి, బుడ్డ సురేష్, చింతల ఉమామహేశ్వరి, బత్తుల జయమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ చిక్క నరసింహ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, మాజీ గ్రంథాలయం చైర్మన్ ఉడుగు మల్లేశం గౌడ్, ముత్యాల భూపాల్ రెడ్డి, చిరందాసు ధనంజయ, గుజ్జుల సురేందర్ రెడ్డి, చింతల వెంకట్ రెడ్డి, పల్లె శేఖర్ రెడ్డి తదితర ప్రజా ప్రతినిధులు, నాయకులతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply